విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం : డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం : డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ

కర్నూలు న్యూస్ వెలుగు: కర్నూల్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 93 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ..

1) మా అమ్మ కు బ్రెయిన్ క్యాన్సర్ పరీక్షల కొరకు తిరుపతికి వెళ్ళి కర్నూలుకి రైలు లో వస్తుంటే పరిచయం చేసుకుని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆదోని, శ్రీనివాస నగర్ శెట్టి గుడి దగ్గర ఉన్న ఉపేంద్ర @ శివ రూ. 40 లక్షలు తీసుకొని మోసం చేశాడని చర్యలు తీసుకోవాలని కర్నూలు, కల్లూరు మండలం, హేమలత నగర్ కు చెందిన ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.

 

2) ఎస్. లింగం దిన్నె దగ్గర ఉన్న మా పొలంలో పొలం పనులు చేసుకునేటప్పుడు అటు వైపు వెళ్ళే చాకలి చిన్న దస్తగిరి కుమారులు మధు, ఈశ్వరయ్య, మల్లికార్జునలు అసభ్యకర మాటాలతో దుర్భాషలాడుతున్నారని చర్యలు తీసుకోవాలని కోడుమూరు మండలం, వర్కూరు గ్రామం కు చెందిన చాకలి జయలక్ష్మీ ఫిర్యాదు చేశారు.

3) అనంతపురం కియా షోరూంలో పని చేస్తున్న స్నేహితుడు ద్వారా పరిచయమైన ఒంగోలుకు చెందిన అశోక్ బెంగుళూరు ఐటి సాఫ్ట్ వేర్ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 4 లక్షల 22 వేలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు మండలం , దూపాడు గ్రామం కు చెందిన సుల్తాన్ ఫిర్యాదు చేశారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS