
గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా తీర్చిద్దిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి :సీఎం
న్యూస్ వెలుగు ఏపీ సచివాలయం: రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా తీర్చిద్దిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ మారుతున్న డైనమిక్స్ కు అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నేడు విద్యుత్ సరఫరా పరిస్థితి, విద్యుత్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కే.విజయానంద్, ఏపీ ట్రాన్స్ కో, జెన్ కో అధికారులు హాజరయ్యారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో 2024 జూన్ నుంచి ఇప్పటి వరకూ రూ.3.19 లక్షల కోట్ల పెట్టుబడి తో ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయని అధికారులు వివరించారు.
Was this helpful?
Thanks for your feedback!