
బీఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు
తెలంగాణ (న్యూస్ వెలుగు): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు. ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్ మరియు వారి అనుచరులు ఈరోజు పార్టీలో చేరారు. రహమత్నగర్, షేక్పేట్ నుండి పలువురు మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నందినగర్ నివాసంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు, జీవన్ రెడ్డి, మైనార్టీ నాయకులు సలీం, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

