
బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) అప్రమత్తంగా వ్యవహరించాలి
జూన్ 15 నుంచి జులై 14 వరకు పత్తికొండ నియోజకవర్గంలో నిర్వహించనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇంటింటి సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్న బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి…..
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
న్యూస్ వెలుగు – పత్తికొండ:
🔷జూన్ 15 నుంచి జులై 14 వరకు పత్తికొండ నియోజకవర్గంలో నిర్వహించనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇంటింటి సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్న బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపునిచ్చారు.
🔷స్థానిక కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాలులో పత్తికొండ నియోజకవర్గ స్థాయి BLAల శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
🔷మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించారు.
🔷ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ప్రతి సంవత్సరం ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపుల ప్రక్రియను నిర్వహిస్తోందన్నారు. అయితే 20 సంవత్సరాలకు ఒకసారి చేపడుతున్న ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు కావాలని, అనర్హుల పేర్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
🔷ఎన్నికల కమిషన్ గుర్తించిన పత్తికొండ నియోజకవర్గంలోని 257 మంది BLAలు గ్రామ స్థాయి నాయకులు, బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ నెల రోజుల పాటు ఇంటింటికీ తిరిగి ఓటరు వివరాలను పరిశీలించాలని సూచించారు. పార్టీ శ్రేణులు ప్రతి కుటుంబాన్ని కలుసుకొని ప్రజలకు సరైన సమాచారం అందిస్తూ, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
🔷ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, బీఎల్ఓలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

