
శ్రీ పరంజ్యోతి భగవతి స్త్రీ శక్తి వరం
ప్రత్యేక మహిళా కార్యక్రమం..
కామారెడ్డి, న్యూస్ వెలుగు: శ్రీ ప్రణయ దాసాజీ చే స్త్రీ శక్తి వరం ప్రత్యేక మహిళా కార్యక్రమం.. 11–5–2025 ఆదివారం రోజున ఉ. 9గంల నుండి శ్రీ సీతారామాంజనేయ దేవాలయం ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరూ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని తెలిపారు. ఈ స్త్రీ శక్తి వరం లో మహిళలు ప్రత్యేకంగా పొందే జ్ఞానం: నేటి ఆధునిక ప్రపంచంలో మహిళల పాత్ర ఎంతో ప్రధానమైనది. తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది. భార్యగా బాగోగులు చూస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప వ్యక్తి స్త్రీ పూర్వకాలంలో స్త్రీలను ఆదిపరాశక్తిగా పూజించేవారు. ఈ విపరీతమైన శక్తి కారణంగా ఆమె చాలా అద్భుతాలను సులభంగా చేయగలిగింది. కానీ నేటి ఆధునిక యుగంలో శక్తిని నిద్రాణమైపోయింది స్త్రీలలో ఈ శక్తి మేల్కొన్నప్పుడు కుటుంబం మరియు సమాజం సరైన మార్గంలో ప్రయాణించడం ప్రారంభిస్తాయి. కాబట్టి మహిళలలో ఉన్న శక్తిని మేలుకొలిపి ప్రేమగల కుటుంబాన్ని అద్భుతమైన సమాజాన్ని సృష్టిద్దాం ..
దైవీక ప్రయోజనాలు: మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. సంపద అభివృద్ధి మరియు పురోగతి సాధించడానికి,
ఆరోగ్యం మరియు దీర్ఘాయువు ప్రేమా మరియు కుటుంబంలో ఆనందం స్త్రీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే నైపుణ్యానికి పొందుతారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు వారి పేర్లు ముందుగానే నమోదు చేసుకోవలేను. మధ్యాహ్నం భోజనం కలదు 11–5–2025 ఆదివారం రోజున ఉ. 9గంల నుండి వేదిక : శ్రీ సీతారామాంజనేయ దేవాలయం ఫంక్షన్ హాల్ వివేకానంద కాలనీ కామారెడ్డి మరిన్ని వివరాలకు జిల్లా కల్కి ఆఫీసు 6262767696 సంప్రదించగలరు.