21కేజీల గంజాయి స్వాధీనం నలుగురు అరెస్ట్

21కేజీల గంజాయి స్వాధీనం నలుగురు అరెస్ట్

న్యూస్ వెలుగు శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై మండలంలోని మడపాం టోలేట్, శ్రీ పైడిమ్మతల్లి గుడి,సత్యవరం ఫ్లె ఓవరు వం తెన కూడలి వద్ద నరసన్నపేట పోలీసులు నిర్వ హించిన సోదాల్లో 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసి, నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. నరసన్నపేట పేట సర్కిల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసన్నపేటలోని సూరజ్ నగర్ లో గంజాయి సేవిస్తూ నరసన్నపేటకు చెందిన సూర కీర్తన్(మణి), గరక మోహన్లు పట్టుబడ్డారన్నారు. వీరు ఇచ్చిన సమాచారంతో సత్యవరం ఫ్లెఓవరు వంతెన వద్ద తనిఖీలు చేస్తుండగా పర్లాకిమిడికి చెందిన సంజు అనే వ్యక్తి పట్టుబడ్డాడని, అతడి వద్ద నుంచి 21.750 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు.అదేవిధంగా వేరే కేసులో మడపాం టోల్ ప్లాజ్ వద్ద వాహనాలు తనిఖీలు లో భాగంగా ఎస్.కె రాబుల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతను వద్ద 4.290 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డిఎస్పి లక్ష్మణరావు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!