చీకటిలో మగ్గిన  గ్రామలకు ఊపిరిపోస్తున్న కూటమి ప్రభుత్వం : వీరభద్ర గౌడ్

చీకటిలో మగ్గిన గ్రామలకు ఊపిరిపోస్తున్న కూటమి ప్రభుత్వం : వీరభద్ర గౌడ్

కర్నూలు : ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్  పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారని వారు అన్నారు. గత ఇదేళ్ల పాలనాలు గ్రామాల అభివృద్ది కుంటుపడిందని వారు అన్నారు . డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన గ్రామీణాభివృద్ది శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టరాని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని వారు అన్నారు. కొంతమంది నాయకులు గుంతకాటి నక్కల ఉంటూ మూడు నెలల కాలంలోనే విమర్శలు చేస్తున్నారని వారు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన అనేక పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నారన్నారు.

జగన్ పాలనలో 5ఏళ్లుగా చీకటిలో మగ్గి పోయిన గ్రామ స్వరాజ్య పంచాయతి వ్యవస్థకు ఊపిరిపోస్తూ గ్రామ సభలను ప్రారంభించడం జరిగిందని. అలాగే 2014-19మధ్య కాలంలో చెత్తనుండి సంపద తయారుచేసే కేంద్రాలను నిర్మిస్తే జగన్ రెడ్డి వాటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నాడు.గ్రామ పంచాయతీ రోడ్లు ఊడ్చేందుకు చీపుర్లుకూడా లేక,డ్రైనేజీలు శుభ్ర పరిచేందుకు స్థోమతులేక సర్పంచులు అప్పులుచేసి గ్రామపంచాయతీలను నిర్వహించే పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. అలాగే రాష్ట్రంలో అనేక మంది సర్పంచులు అప్పులబాధ తాళలేక బ్రతుకుదెరువుకోసం ఊళ్ళువదిలి వెళ్లిపోవడం జరిగిందని , కావున TDP,  జనసేన, BJPల కూటమి ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపుగా అడుగులు వేయడంకోసం మన ముఖ్యమంత్రి  గ్రామసభలను ప్రారంభించడం జరిగిందన్నారు.

ఈకార్యక్రమంలో ఆలూరు Mpdo ,ఆలూరు SI ,గ్రామ సర్పంచ్,మండల అధికారులతో పాటు , పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!