
ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోండి : ఏఈ ఉమాకాంత్
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: కొత్త ఇల్లు నిర్మాణానికి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని హౌసింగ్ ఏఈ ఉమాకాంత్ తెలిపారు. మండల కేంద్రమైన మద్దికేర లో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కేయి శ్యాం బాబు ఆదేశాల మేరకు కూడా పథకం ద్వారా కొత్త ఇంటి నిర్మాణానికి, రెండు లక్షల 50 వేలు ఇస్తామన్నారు. మండల పరిధి లోని గ్రామాలలో ఇళ్లలేని ప్రతి లబ్ధిదారులు సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్, ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!