
శివకుమార్ పై దాడి అమానుషం : మంత్రి
న్యూస్ వెలుగు అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనలో వైసీపీ రౌడీ మూకలు పథకం ప్రకారం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి నారలోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు . మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడే చేసినట్లే నంది వారు మండిపడ్డారు. శివకుమార్ పై విచక్షణారహితంగా దాడిచేసి రాక్షసానందం పొందారని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు వైసీపీ ఇంఛార్జ్ విజయానందరెడ్డి ప్రోద్బలంతోనే వైసీపీ రౌడీలు ఈ హేయమైన చర్యకు పాల్పడ్డారని వారు అన్నారు. జగన్ పరామర్శల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రప్పా రప్పా అంటూ వార్నింగ్ లు ఇవ్వడం వైసీపీ తీరుకు నిదర్శనమన్నారు . శివకుమార్ పై దాడికి పాల్పడినవారికి చట్టపరిధిలో శిక్షతప్పదని హెచ్చరించారు.
Was this helpful?
Thanks for your feedback!