పరిపాలనలో చంద్రబాబు నాకు స్ఫూర్తి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

పరిపాలనలో చంద్రబాబు నాకు స్ఫూర్తి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

కృష్ణా : పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సోమవారం ఉదయం కృష్ణా జిల్లాలోని కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు. 3 వేల కిలోమీటర్ల సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు పవన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు అభివఅద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ … ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్‌ కు ఎంతో బలమని అన్నారు. రాష్ట్రం అభివఅద్ధి చెందాలంటే ఎంతో అనుభవం ఉన్న నాయకుడు అవసరమని, చంద్రబాబు వంటి నాయకుడి అనుభవాన్ని వాడుకోకపోతే తప్పు చేసినవాళ్లమవుతామని చెప్పారు. అందుకే టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఎన్నో దెబ్బలు తిన్నామని, తట్టుకుని నిలబడ్డామని చెప్పారు. పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని పదేపదే విమర్శించడం తనకు ఇష్టం ఉండదని, ఎంతో పారదర్శకంగా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వ అధికారులు కూడా పారదర్శకతతో పని చేయాలని సూచించారు. ఏ అధికారి అయినా తప్పు చేస్తే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలనేదే తమ ఆకాంక్ష అని డిప్యూటీ సీఎం చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు రావాలని, పల్లెల్లో వెలుగులు నిండాలని కోరారు. ఇవన్నీ జరగాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఉందని, ఆ పార్టీని ఓడించేందుకు గట్టిగా కఅషి చేశామని చెప్పారు. చంద్రబాబు బలమైన నాయకత్వం వల్ల రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. పరిపాలన వేరు, రాజకీయాలు వేరని చెప్పారు. 3 వేల కిలోమీటర్ల సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు పవన్‌ శంకుస్థాపన చేశారు. సంక్రాంతి నాటికి రోడ్ల పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించామని ఆయన చెప్పారు. అందుబాటులో ఉన్న ఉపాధి నిధులతో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకొస్తున్నారని తెలిపారు. గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం పంచాయతీ పనులు కొనసాగుతాయన్నారు. రూ.4,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పనులు చేస్తున్నామని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!