తహసీల్దార్ సతీష్
హోళగుంద,న్యూస్ వెలుగు: రెవిన్యూ సదస్సులో ప్రతి రైతు యొక్క భూ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ సతీష్ అన్నారు.మంగళవారం మండల పరిధిలోని కోగిలతోట గ్రామంలో సర్పంచ్ గురుపాదమ్మ అధ్యక్షతన రెవిన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ భూ సమస్యల పరిష్కా

రం దిశగా గ్రామ స్థాయిలోనే రెవిన్యూ సదస్సులను చేసి అధికార యంత్రాంగాన్ని గ్రామాలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచి సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.కావున ప్రజలు తమ భూములకు సంభందించి ఏమైనా సమస్యలు ఉంటే అర్జీ రూపంలో సమర్పిస్తే సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.అలాగే గుళ్యం వైపు రహదారి నుంచి శ్రీ గాదిలింగప్ప తాత గుడి వరకు రహదారిని కొలత వేసి హద్దులు చూపించాలని గ్రామస్తులు వినంతి పత్రం సమర్పించారు.అంతేకాకుండా 26 మంది రైతులు భూ సమస్యల పై అర్జీ సమర్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు నాగప్ప నాయుడు,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప, వి ఆర్ ఓ సూరంజినేయులు మాజీ సర్పంచ్ వెంకటేష్,గోవర్ధన్, గాదిలింగ,డీలర్ శేషి రెడ్డి,వీరేష్,వన్నురప్ప, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!