జమ్మలమడుగు టి పి ఆర్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా

జమ్మలమడుగు టి పి ఆర్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటీవా ..వైల్డ్ ఫైర్.. తగ్గేదెలె అంటున్న అల్లు ఫ్యాన్స్

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు;  పుష్ప2 సినిమా సందడి మొదలైంది. తమ అభిమాన హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా వరల్డ్ వైస్ గా విడుదలవుతున్న సందర్భంగా జమ్మలమడుగు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున టి పి ఆర్ థియేటర్ వద్ద బ్యాండ్ బాజాలతో ఫ్యాన్స్ సందడి చేశారు. భారీ కటౌట్లతో , ఫ్లెక్సీలతో థియేటర్ మొత్తం నిండిపోయింది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా. ఇంటర్నేషనల్ అనే విధంగా ఫ్యాన్స్ తగ్గిదిలే అంటున్నారు. పుష్ప నేషనల్ అయితే పుష్ప 2 ఇంటర్నేషనల్ లో అదరగొట్టి ఆస్కార్ అవార్డు విజేతగా నిలుస్తుందని, ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన హైలెట్ గా చూపించిన దర్శకుడు సుకుమార్ గారికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కృతజ్ఞతలు తెలిపారు. వరల్డ్ వైజ్ గా విడుదలవుతున్న పుష్ప 2 చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో అతి తక్కువ సమయంలోనే తెలిసిపోతుంది.

Author

Was this helpful?

Thanks for your feedback!