మాదన్నగారిపల్లె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం 

మాదన్నగారిపల్లె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం 

   మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట కృష్ణారెడ్డి

ముద్దనూరు, న్యూస్ వెలుగు;  ముద్దనూరు మండలము మాదన్నగారిపల్లె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమమును నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.ఇందులో భాగంగా గ్రామంలో సాగు చేసిన శనగ, కంది,నువ్వు పంటలను పరిశీలించి రైతులకు తగు సలహాలు సూచనలు అందించినట్లు తెలిపారు.కంది పంట లో పూత,కాయ దశలో పురుగు ఆశించకుండా కొరాజిన్ అనే మందు ఎకరానికి 60 యమ్.యల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని కోరారు.అలాగే రబీలో సాగు చేసిన అన్ని పంటలను తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని సూచించారు.పంట నమోదు అన్ని పథకాలకు ప్రామాణికం అని తెలిపారు.అలాగే రబీలో సాగు చేసిన అన్ని పంటలను పంట నమోదు చేసుకుని తదుపరి పంట బీమా చెల్లించాలని కోరారు. ఆయా ఆర్ యస్ కె ల సిబ్బందిని సంప్రదించి పంట బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.అలాగే రైతులు తమ పోలములో ఏ పంట అయితే సాగు చేశారో ఆ పంట కు మాత్రమే పంట బీమా ప్రీమియం చెల్లించాలని తెలిపారు.ఒక పంట సాగు చేసి ఇంకో పంటకు బీమా డబ్బులు కట్టితే ప్రీమియం డబ్బులు నష్టపోతారని తెలిపారు.అలాగే పంట సాగు చేయకుండా పంట బీమా కొరకు ప్రీమియం చెల్లిస్తే కూడా డబ్బులు నష్ట పోతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యాన సహకులు అయాన్.రామసుందర్ రెడ్డి మరియు గ్రామ రైతులు మాజీ సర్పంచ్ పి.చిన్న వెంకట సుబ్బయ్య, రమేష్ నాయిడు, రవి శంకర్ నాయిడు,ప్రసాద్ నాయిడు,లు తదితర రైతులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!