
ముద్దనూరు మండల రైతులు అప్రమత్తంగా ఉండాలి
అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బ తినకుండా తగు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.ఏవో
ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలంలోని రైతులు అధిక వర్షం వల్ల పొలము లో నీరు నిలబడి సున్నితమైన శనగ పంట దెబ్బతినే అవకాశం ఉంది అని తెలిపారు.కావున రైతు సోదరులు పొలములో నీరు నిలబడకుండా మురుగు కాలువలు ఏర్పాటు చేసుకుని నీరు బయటకు పోయే విధముగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనగ పంటలో నీరు నిలబడకుండా తగు జాగ్రత్తలు రైతులు తప్పకుండా పాటించాలని కోరారు.తేమ ఆరిన వెంటనే 19.19.19. అనే ఎరువును 10 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు.ముఖ్యంగా నల్ల రేగడి నేలల్లో అధిక వర్షం ,అధిక తేమ వల్ల శనగ పంటలో వేరు కుళ్లు ఎక్కువగా ఆశిస్తుంది అని తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.హెక్సా కొనజోల్ 2 యమ్.యల్. లేదా టేబుకొనజోల్ 1 యమ్.యల్. లేదా సాఫ్ 1.5 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలని కోరారు.అలాగే కాపర్ ఆక్సి క్లోరైడ్( బ్లైటాక్స్)2 గ్రాములు కలిపి పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అని రైతులకు తెలిపారు. అధిక వర్షాల నుండి పంట ను కాపాడుకోవాలి అంటే శనగ రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారి వెంకట కృష్ణారెడ్డి సూచించారు.