రైతులు నత్రజని ఎరువులను అధికంగా పంటలకు వాడరాదు; ఏవో
ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలంలోని యామవరం రైతుసేవా కేంద్రంలో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి యం.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ యూరియా 19.98 టన్నులు డిఎపి 20 టన్నులు ఎరువులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది అని మండల వ్యవసాయ అధికారి యం.వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.మండలంలో యామవరం రైతు సేవా కేంద్రంలో కోరమాండల్ గ్రాన్యూలర్ యూరియా 222 బస్తాలు మరియు ఉప్పలూరు రైతు సేవా కేంద్రం లో కోరమాండల్ గ్రాన్యూలర్ యూరియా 222 బస్తాలు మొత్తం 19.98 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంది అని కావాల్సిన రైతులు రైతు సేవా కేంద్రాలకు వెళ్లి తమ ఆధార్ కార్డు ను తీసుకుని వెళ్లి అవసరం మేరకు తీసుకుని వెళ్ళాలి అని తెలిపారు.అలాగే కోరమాండల్ డిఎపి 20 టన్నులు పెనీకలపాడు 1&2 లో అందుబాటులో ఉంది అని తెలిపారు.కావలసిన రైతులు ఆయా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి కావలసిన ఎరువులను తీసుకుని వెళ్లి రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.యూరియాను పంటలకు అధికంగా వినియోగించరాదు అని తెలిపారు.ఎక్కువగా వాడితే ఏపుగా పెరిగి చీడ పీడలుకు గురి అయ్యే ప్రమాదం ఉంది అని తెలిపారు.సిపారస్ చేసిన మేరకే నత్రజని ఎరువులు వాడుకోవాలని రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ యమ్.పి.ఈ.ఓ.బి.గంగయ్య, మరియు రైతులు పాల్గొన్నారు.