అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

న్యూస్ వెలుగు, కర్నూలు; అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సందర్భంగా జిల్లా కోర్టు లోని న్యాయ సేవ సదన్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ టీవీ ఛైర్మన్ జి.కబర్ధి, న్యాయ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మాన

సిక దివ్యాంగుల అవసరార్థం అనేక చట్టాలు వున్నాయని వాటిని సరైన రీతిలో ఉపయోగించి సత్వర న్యాయం పొంద వచ్చునని తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవధికర సంస్థ, అమరావతి ఆదేశాలమేరకు నవంబర్ 12న నంద్యాల నందుగల నవ జీవన్ డెఫ్ స్కూల్ నందు నిర్వహించిన మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మెడికల్ క్యాంప్ లో కొద్ది మండి విద్యార్థులకు వినికిడి లోపం అధికంగా వున్నదని కనుగొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉడుములపాడు నందుగల అగ్రిసోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధికారి సి.హెచ్. వి. నారాయణరెడ్డి సౌజన్యంతో జిల్లా జడ్జ్ చేతులమీదుగా 10 మంది విద్యార్థులకు చెవిటి మెషిన్ లు పంపిన చేశారు. ఉడుములపాడు అగ్రిసోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధికారులు , షణ్ముఖ సాయి, సురేంద్రనాథ్ రెడ్డి, ఈ.ఎన్.టి. డాక్టర్ రంగనాథ్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!