జొన్నగిరి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్.సి మల్లి కార్జున

జొన్నగిరి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్.సి మల్లి కార్జున

తుగ్గలి, న్యూస్ వెలుగు;  తుగ్గలి మండలం పరిధిలోని గల జొన్నగిరి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా ఎస్.సి మల్లికార్జున బుధవారం రోజున భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా జొన్నగిరి నూతన ఎస్సైగా భాద్యతలు చేపట్టిన ఎస్సై మల్లికార్జున మాట్లాడుతూ జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించాలని, సమాజంలో ఎవరైనా ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.ఇటు ప్రజలకు అటు ప్రభుత్వాలకు ప్రజా పరిరక్షణకు నిరంతరంగా కృషి చేసే పోలీసులకు అందరు సహకరించాలని ఆయన తెలియజేశారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ కు జొన్నగిరి పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!