
టిడిపి సీనియర్ నాయకుడు మృతి
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; ఒంటిమిట్ట మండలం చింతరాజు పల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొడ్డే .సుబ్బానాయుడు ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఈయన అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిసింది. కొన ఊపిరి వరకు పార్టీ అభ్యుదయం కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా మండలంలో ఒక సీనియర్ నాయకుడిగా ఉంటూ ప్రజల కోసం కృషి చేయడం జరిగింది. గతంలో శ్రీ కోదండరామ స్వామి ఆలయ బోర్డు చైర్మన్గా కొనసాగి, మూడు పర్యాయాలు సర్పంచుగా, ఎంపీపీగా మండల ప్రజలకు తన వంతుగా సేవలు అందించారు. సీనియర్ నాయకుడు బొడ్డే. సుబ్బా నాయుడు మృతి విషయం తెలుసుకున్న మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజానీకం దిగ్భ్రాంతికి లోనైంది. ఈయన మృతి పార్టీకి తీరని లోటని కార్యకర్తలు, నాయకులు తెలపడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఆయన స్వ గ్రామమైన చింతరాజుపల్లెలో దహన సంస్కారాలు చేస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు.