
తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం విద్యుత్ కార్మికుల పక్షాన నిలబడుతుంది
బేతంచర్ల సబ్ డివిజన్ తెలుగునాడు డివిజన్ అధ్యక్షులు రవి
బేతంచర్ల, న్యూస్ వెలుగు; బేతంచర్ల సబ్ డివిజన్ పరిధిలో తెలుగు నాడు విద్యుత్ సంఘం డోన్ డివిజన్ ప్రెసిడెంట్ రవీంద్ర వరప్రసాద్, మరియు సెక్రటరీ నాగ చంద్రుడు ఆధ్వర్యంలో బేతంచెర్ల సబ్ డివిజనులో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు, మరియు కాంటాక్ట్ కార్మికులు తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘంలో చేరడం జరిగినది, ఈ కార్యక్రమనీ ఉద్దేశించి తెలుగునాడు డివిజన్ అధ్యక్షులు రవి గారు మాట్లాడుతూ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం విద్యుత్ కార్మికుల పక్షాన నిలబడుతూ వారి సమస్యలపై అధ్యయనం చేస్తూ వారికి ఎటువంటి సమస్యలు వచ్చిన మన యూనియన్ ముందుండి వారి సమస్యలకు పరిష్కారం చేస్తామని తెలియజేశారు ,ఈరోజు యూనియన్లో చేరిన విద్యుత్ కార్మికులను ఉద్దేశించి చెప్పడం జరిగింది అలాగే వారి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది వీటిలో ముఖ్యంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులైనటువంటి ఆపరేటర్స్ మరియు పోల్ టు పోల్ కార్మికులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించిన సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది, ఈరోజు యూనియన్ లో చేరిన వారు లైన్మెన్లు మస్తాన్, కృష్ణమూర్తి, ఏ ఎల్ ఎం రాముడు, పోల్ టు పోల్ కార్మికులు సుబ్బయ్య, మల్లేశు, సోమన్న, ఆపరేటర్స్ పి ఎల్ సోమన్న, శ్రావణ్ కుమార్ రెడ్డి యూనియన్ లో చేరడం జరిగినది, ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మధు, లైన్మెన్ కృష్ణారెడ్డి, ఈసీ నెంబర్ చంద్రశేఖర్ గౌడ్, సూర్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు