భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం ; డివైఎఫ్ఐ

భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం ; డివైఎఫ్ఐ

డివైఎఫ్ఐ 44 వ ఆవిర్భావ దినోత్సవ జండా ఆవిష్కరణ

ప్రొద్దుటూరు టౌన్, న్యూస్ వెలుగు; ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద . డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్ రాజ్ డివైఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేసి అనంతరంఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిగారు మాట్లాడుతూ 1980 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నగరంలో అందరికీ విద్య – అందరికీ ఉపాధి అనే నినాదంతో ఆర్థిక , సామాజిక, లింగ వివక్షతలకు వ్యతిరేకంగా స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో పనిచేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య నీ ఏర్పాటు చేశారని తెలిపారు. నాటినుండి నేటి వరకు అనేక ఉద్యమాలు పోరాటాలు సేవా కార్యక్రమాలు నిర్వహించి దేశంలోని యువత మద్దతు పొంది అతిపెద్ద యువజన సంఘం ఎదిగిందని తెలిపారు. నేడు మతోన్మాదంతో, సామ్రాజ్యవాదంతో దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగి యువత పరిస్థితి దరిద్రంగా మారిందని తెలిపారు. కావున యువతి యువకులందరూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముఖ్యంగా అమెరికా ప్రోత్బలంతో పాలస్తీనా పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఖండించాలని, క్యూబా పై అమెరికా ఆర్థిక నేర్పందాన్ని ఎత్తివేయటానికి పోరాటం చేయాలని అలాగే దేశంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ చేసి యువతకు ఉపాధి లేకుండా చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల పైన వేస్తున్న బారాలకు వ్యతిరేకంగా, యువతకు ఉపాధి లేకుండా తక్కువ వేతనానికే ఎక్కువ పని చేయించుకునే దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. యువతి యువకులందరూ ఐక్యంగా ముందుకు కదిలి డివైఎఫ్ఐ నీ మరింత బలోపేతం చేయాలని అప్పుడే నేటి యువతకు విద్యా ఉపాధి ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. నిరుద్యోగం అంతం డివైఎఫ్ఐ పంతం డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ పంతం అనే నినాదంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ కమిటీ సభ్యులు ఓబులేసు, మోహన్, దస్తగిరి ,ప్రదీప్ యువత పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!