
రాయలసీమ మహిళా సంఘ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు..
శకుంతల రాయలసీమ
కర్నూలు, న్యూస్ వెలుగు; రాయలసీమ మహిళా సంఘ్ నిర్వహిస్తున్న కర్నూల్ అశోక్ నగర్ పంప్ హౌస్ ఎదురుగా ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. వసతి గృహ నిర్వాహకురాలు రాయలసీమ శకుంతల మాట్లాడుతూ మహిళా దినోత్సవ ప్రాముఖ్యత గురించి వివరిస్తూ, మహిళలు ఎలా ఎదగాలి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పిరికి వారిలా మరణం వరకు వెళ్తూ ఉంటారు. క్షణికావేశంలో క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మనం ఏంటో బతికి చూపించాలి అని ఆమె అన్నారు. వసతి గృహములోని మధ్య మహిళల మధ్య కేక్ కట్ చేసి అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన బహుమతులు అందజేశారు. అలాగే షెల్టర్ లో వాళ్లందరికీ వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. మహిళలు షెల్టర్ లోని వారు సన్మానం చేసి వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మహిళలు వసతి గృహంలోని మహిళలు అందరు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar