మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు  జి పి ఆర్ ట్రస్ట్ వారిచే వితరణ

 మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు  జి పి ఆర్ ట్రస్ట్ వారిచే వితరణ

కర్నూలు, న్యూస్ వెలుగు; ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కర్నూలు జిల్లాలోని పుల్లారెడ్డి స్వీట్స్ అంటే తెలియని ఎవరు ఉండరు.. దానిని స్థాపించినది గుణంపల్లి పుల్లారెడ్డి ఆయన స్వతహాగా చదువుకోనప్పటికీ ఆయనకు చదువు అంటే చాలా ఇష్టం. విద్యార్థులకు సహాయం చేయాలి అంటే ఎంతో ఇష్టం.. ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు డెంటల్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలను ఆయన స్థాపించారు..ఆయన ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలులో పీడియాట్రిక్ బ్లాకును మరియు శ్యాలమ్మ సత్రాన్ని కూడా ప్రారంభించారు.. ప్రారంభించిన ట్రస్టును వారి కుమారులు రాఘవరెడ్డి మరియు ఏకాంబర రెడ్డి, దానిని కొనసాగిస్తూ ఆ ఉపకార వేతనాలను 2008 వ సంవత్సరం నుంచి కొనసాగిస్తూనే ఉన్నారు.. అది ప్రతి ఏటా నూరు మంది ఇస్తూ ఇప్పుడు 200 మంది వరకు ఇస్తూనే ఉన్నారు..
ఒకప్పుడు సంవత్సరానికి 7 లక్షల నుంచి ప్రారంభమైన ఇప్పుడు దాదాపు 77 లక్షల దాకా ఇస్తున్నారు.. ఇప్పటివరకు 5.93 కోట్ల సొమ్మును 2,963 మంది విద్యార్థులకు ఉపకార వేతనంగా వితరణ చేసారు. ప్రతి సంవత్సరము 200 మందికి మెరిట్ లో ఇంటర్ మరియు డిగ్రీ పాసైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్ తరపున ప్రోత్సాహకంగా ఇస్తూ ఉంటారు..ఈ ఫంక్షన్కు నేను ముఖ్యఅతిథిగా వెళ్లి ఆ విద్యార్థులకు బాగా చదువుకోవాలని వారి కర్తవ్యాన్ని బోధిస్తూ ఉపకార వేతనాలను అందించడం జరిగింది… చాలామంది తాము దానం చేసినాము అని చెప్పుకోవడానికి గొప్పలు చెప్పుకోవడానికి దానం చేస్తారు.. కానీ పుల్లారెడ్డి సంస్థ వారు తాము చేసిన మంచి పనిని కానీ దానాలను కానీ ఒక చేతిది మరొక చేతికి తెలియకుండా చేస్తూ ఉంటారు..అంతేకాకుండా తైత్తిరీయరి ఉపనిషత్తులో చెప్పినట్లు.శ్రద్ధయాదేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదా దేయం-
అనే ఉపనిషత్తుల సూత్రాన్ని పాటిస్తూ ఏ పని చేసినా కానీ ఏ పుణ్యకార్యాలు చేసినా కానీ చాలా శ్రద్ధగా ఎంతో ఆనందంగా సంతోషంగా వాళ్లు చందాలు ఇవ్వడం లో కానీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం లో గాని ఎంతో సంతోషంతో ఇస్తారు.. అలా చేసినప్పుడే వారికి జీవితాలకు ధన్యత లభిస్తుంది.ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి విద్యార్థులకు సందేశం ఇచ్చి వారికి ఉపకార వేతనాలు ఇవ్వడానికి నన్ను ఆహ్వానించినందుకు పుల్లారెడ్డి ట్రస్ట్ యొక్క మేనేజింగ్ ట్రస్టీలు మరియు వారి కుమారులు అయినటువంటి రాఘవ రెడ్డి , ఏకాంబర రెడ్డి మరియు సుబ్బారెడ్డి మరియు కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు..
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు.

Author

Was this helpful?

Thanks for your feedback!