అనంతపురానికి ఎంత చేసినా తక్కువే మంత్రి నారా లోకేష్

అనంతపురానికి ఎంత చేసినా తక్కువే మంత్రి నారా లోకేష్

అనంతపురం జిల్లా (న్యూస్ వెలుగు): కల్యాణదుర్గం పట్టణంలో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో మంత్రి నారాలోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబుకి ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థంగా ముందుకు నడిపిస్తున్నారని, ఏపీని చూసి పొరుగు రాష్ట్రాలు అసూయపడే రోజు తీసుకువస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం.. అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ మంత్రి లోకేష్ కొనియాడారు. అనంతపురం జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని. జగన్ రెడ్డి ఏనాడు సొంత కార్యకర్తలను పట్టించుకోలేదని ఏద్దేవా చేశారు. కార్యకర్తే అధినేత అని ప్రకటించిన పార్టీ తెలుగుదేశమన్నారు నారా లోకేష్. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఆయన కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS