
అనాధలకు న్యాయ హక్కులు కల్పించడం మన బాధ్యత
కర్నూలు( న్యూస్ వెలుగు ) : అనాధలకు న్యాయ హక్కులు కల్పించడం మన బాధ్యత అని శాశ్వత లోక్అదాలత్ చైర్మన్ రిటైర్డ్ జిల్లా జడ్జి వెంకట హరినాథ్ అన్నారు.
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ లీలా వెంకట శేషాద్రి సూచనల మేరకు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ డిటైర్డ్ జిల్లా జడ్జి వెంకట హరినాథ్ ,లీగల్ సర్వీసెస్ యూనిట్ సభ్యులు పారా లీగల్ వాలంటీర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, రిటైర్డ్ డిఎస్పి పాపారావులు పుల్లారెడ్డి కాలేజీ సమీపంలో ఉన్న కంపాషన్స్ సొసైటీ హోమ్ ఆఫ్ హోప్ ను తనిఖీ చేశారు. అక్కడి సౌకర్యాలు పరిశుభ్రతను పరిశీలించారు. అక్కడ వసతి పొందుతున్న అనాధలకు అడిగి నిర్వాహకులు అందించే భోజన వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనాధలకు ఎవరికైనా న్యాయ సాయం అవసరం అయితే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 15100 ను సంప్రదించాలని కోరారు.

