
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి
ఇంద్రకీలాద్రి (న్యూస్ వెలుగు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. మంత్రి రాక సందర్భంగా, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈ.వో) వి.కె. శీనా నాయక్ నేతృత్వంలో ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం, మంత్రి సంధ్యారాణి, ఆమె కుటుంబ సభ్యులు దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం, ఆలయ వేద పండితులు, ప్రధాన అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈవో శీనా నాయక్ మరియు ఇతర అధికారులు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రాలు మరియు జ్ఞాపికను మంత్రికి అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			
