
అలరించిన సినిమా ఇది ..! నితిన్
సినిమా రివ్యూ News Velugu : ‘రాబిన్ హుడ్’ చిత్రం యూత్ స్టార్ నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా, దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ చిత్రం. ఈ సినిమా మార్చి 28, 2025న విడుదలైంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌ను ఇచ్చారు.
సినిమా ఫైనల్ రన్ టైం 2 గంటల 26 నిమిషాలుగ అందించారు. సినిమా సెన్సార్ టాక్ పాజిటివ్‌గా నడుస్తోంది . ఫస్ట్ హాఫ్‌లో నితిన్-శ్రీలీల లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. అలాగే వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్‌ల కామెడీ ఆడియన్స్ కాస్త నవ్వించిందనే చెప్పొచ్చు. సెకండ్ హాఫ్‌లో కామెడీతో పాటు స్టైలిష్ ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ సర్‌ప్రైజ్ చేస్తాయని ఆడియన్స్ చెబుతున్నారు. క్లైమాక్స్‌లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక ఎంట్రీ హైలైట్‌గా నిలిచిందని తన నటన కొత్తగా ఉందని సినిమా విశ్లేషకుల సమాచారం. నితిన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్లస్‌గా నిలిచిందని, శ్రీలీల పాత్ర కూడా ఆమె గత చిత్రాలకు భిన్నంగా, కొత్తగా ఉందని చెబుతున్నారు.
మొత్తానికి, లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్, ట్విస్ట్‌లతో పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్‌గా ‘రాబిన్ హుడ్’ నిలిచిందని ఇన్‌సైడ్ టాక్. నితిన్ ఈ సినిమాతో ఇండస్ట్రీలో తనదైన సత్తా మరోసారి రుజువుచేశాడని , తన అభిమానులకు ఈ సినిమాతో మంచి హిట్ ఇచ్చారని సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.