
ఆలయంలో స్వచ్ఛంద్ర కార్యక్రమం పాల్గొన్న అధికారులు
ఇంద్రకీలాద్రి న్యూస్ వెలుగు: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో “స్వచ్ఛంద్ర” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది, అధికారులు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ పరిశుభ్రత పట్ల తమ నిబద్ధతను తెలియజేస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ బొర్రా రాధకృష్ణ అధ్యక్షతన జరగగా ఆలయ కార్యనిర్వహణాధికారి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వి.కె. శీనా నాయక్ సిబ్బందితో పరిశుభ్రతపై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యలు అవ్వారు శ్రీనివాస రావు, తాంబాలపల్లి రమాదేవి, సుకశ్రీ సరిత తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

