ఆ కుటుంబాన్ని ఆదుకోండి : కురువ సంఘం

ఆ కుటుంబాన్ని ఆదుకోండి : కురువ సంఘం

న్యూస్ వెలుగు నంద్యాల జిల్లా:  జూపాడు బంగ్లా మండలం,  పారుమంచాల, గ్రామంలో బుడమాకు తిని 20 గొర్రెలు మరణించాయి .సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘము జిల్లా ప్రధానకార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,నందికొట్కూరు మండల కురువ సంఘము అధ్యక్షులు అల్లూరు వెంకటేశ్వర్లు ,ఓర్వకల్ మండల కురువ సంఘము అధ్యక్షులు అల్లబాబు ,కురువ మహేష్ ,రామయ్య లు పారుమంచాల గ్రామంలో నష్టపోయిన గొర్రెలకాపరుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు .

ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి మాట్లాడుతూ గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తిగా నమ్ముకొని జీవిస్తున్న కురువ శ్రీనివాసులు , కురువ కృష్ణ ,కురువ మల్లయ్య ,కురువ లింగన్న లు దాదాపు 3 లక్షల రూపాయల విలువచేసే గొర్రెలు మరణించడముతో ఉపాధి కోల్పోయారని ,కావున ప్రభుత్వం వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవలెనని డిమాండ్ చేసారు . గొర్రెల పెంపకందారులు పెంచుకుంటున్న ప్రతి గొర్రెపిల్లకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయించి,గాలికుంటూ ,నట్టల నివారణ తదితర జబ్బుల నివారణకు ,వాక్సిన్ ,మందులు ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వవవలెనని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కురువ రాముడు తదితరులు పాల్గిన్నారు .

Author

Was this helpful?

Thanks for your feedback!