ఇంజనీరింగ్ అసిస్టెంట్ లపై పని భారాన్ని తగ్గించాలి..!
తుగ్గలి న్యూస్ వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లపై పని భారాన్ని తగ్గించి, ప్రమోషన్లను కల్పించాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎంపీడీవోలకు వినతిపత్రాన్ని అందజేశారు.మంగళవారం రోజున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద వారు నిరసనను వ్యక్తం చేస్తూ రేషనల్లైజేషన్లో భాగంగా మిగులుగా చూపిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వనున్నారు తగు విషయాలపై స్పష్టత ఇచ్చి ప్రమోషన్లను కల్పించాలని, ఒక ఇంజనీరింగ్ విభాగానికి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్లను కేటాయించాలని,మూడు నోషనల్ ఇంక్రిమెంట్లను అందజేయాలని, సొంత మండలాలలో విధులు నిర్వహించడానికి అవకాశం కల్పించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తుగ్గలి ఎంపీడీవో కార్యాలయం నందు ఏవో మహబూబ్ బాషా కు వారు వినతి పత్రాన్ని అందజేశారు.తాము అందజేసిన వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి మండల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,సచివాలయ ఇతర శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.