
ఇందిరమ్మ రాజ్యంలో యువతకు ఉద్యోగాల పండుగ: ఉప ముఖ్యమంత్రి
తెలంగాణ (న్యూస్ వెలుగు): తెలంగాణ ఏర్పాటుకు యువత చేసిన కృషి మరువలేనిదని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కఅన్నారు. బంగారు తెలంగాణను సాధించినప్పటికీ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడంలో పదేళ్లపాటు నియంతృత్వ కోరల్లో చిక్కుకొని పోయిందని బట్టి తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ చేసిన వాగ్దానం సైతం నిలబెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు పదేళ్ల పాటు ఎదురు చూశారని వారందరి ఎదురుచూపులకు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఫలితం లభిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!