
ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈవో
ఇంద్రకీలాద్రి( న్యూస్ వెలుగు ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంలో శనివారం సంకటహర చతుర్థిని పురస్కరించుకుని నూతన యాగశాల వద్ద ఆలయ స్థానా చార్య వి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) వి.కె. సీనా నాయక్ పాల్గొని ఘనంగా పూజా కార్యక్రమము నిర్వహణ..
ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున శ్రీ గణేష్ మహారాజ్ కి గణపతి హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా సామాగ్రితో ఆరాధనలు చేసి, స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు.
దేవస్థానం వైదికకమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. శ్రీ వినాయక స్వామికి విశేష పూజలు చేసి, భక్తులకు అనుగ్రహాశీస్సులు అందించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని భక్తులు లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి, విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు.


