
ఇది ప్రజా ఉద్యమం: వైయస్సార్సీపి రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి
తుగ్గలి న్యూస్ వెలుగు : ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ నందు మాజీ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించు ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి తుగ్గలి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని వారు తెలియజేశారు.వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడం ద్వారా వైద్య వ్యవస్థ నిర్వీర్యమైపోతుందని,పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండదని ఆయన తెలియజేశారు.ప్రభుత్వానికి కనువిప్పు కలిగే వరకు ఈ ప్రజా ఉద్యమం ఆగదని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కావున బుధవారం రోజున జరిగే ప్రజా ఉద్యమం కార్యక్రమానికి మండల పరిధిలోని గల వైఎస్ఆర్సిపి నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

