ఉజ్వల భారత్ ర్యాలీలో పాల్గొన్న సీఐ ఇందిరా

ఉజ్వల భారత్ ర్యాలీలో పాల్గొన్న సీఐ ఇందిరా

సత్యసాయి జిల్లా :  దేశానికి స్వతంత్రం తెచ్చిన సమరయోధుల అడుగుజాడల్లో ప్రతి విద్యార్థి నడవాలని కొత్తచెరువు సీఐ ఇందిరా పేర్కొన్నారు. గురువారం శ్రీ చైతన్య పాఠశాల ఉమ్మడి జిల్లా ఏజీఎం సుబ్బారెడ్డి, విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉజ్వల భారత్ ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు కొత్తచెరువు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల వేషధారణలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ ఇందిర మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఎలాంటి స్వార్థం లేకుండా దేశానికి సేవ చేశారని వారి అడుగుజాడల్లో విద్యార్థులు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.విద్యార్థులు బాగా చదువుకొని దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. ప్రపంచ దేశాలలో మన దేశానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకువచ్చేలా విద్యార్థులు సాంస్కృతిక, రాజకీయ, క్రీడా, విద్య, వైద్య, వైజ్ఞానిక మొదలైన అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నవీన్ కుమార్ రెడ్డి, హనుమంతు, ఏవో కేశవరెడ్డి, పిఈటి నరేంద్ర,సుధ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS