
ఉత్తమ విధులకు ప్రశంసా పత్రాలు
పత్తికొండ/తుగ్గలి న్యూస్ వెలుగు: ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.జిల్లా కేంద్రమైన కర్నూలు నందు జరిగిన క్రైమ్ మీటింగ్ లో భాగంగా ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా ప్రతిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ఉత్తమ విధులను నిర్వహించిన పత్తికొండ రూరల్ సీఐ పులి శేఖర్ గౌడ్ కు,జొన్నగిరి ఎస్సై ఎన్.సి మల్లికార్జున కు జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పత్తికొండ రూరల్ పోలీస్ సిబ్బంది,జొన్నగిరి పోలీస్ సిబ్బంది సీ.ఐ పులి శేఖర్ గౌడ్ కు, జొన్నగిరి ఎస్సై మల్లికార్జున కు వారు శుభాకాంక్షలను తెలియజేశారు.

Was this helpful?
Thanks for your feedback!

