
ఉపాధి హామీ సదస్సులను విజయవంతం చేయండి
పుట్టపర్తి : ఆగస్టు 23న జిల్లావ్యాప్తంగా జరిగే జాతీయ ఉపాధి హామీ పని సదస్సులలో ఉపాధి కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు కోరారు . వారు పుట్టపర్తి సిపిఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ఒక సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని కూలీలకు మౌలిక సదుపాయాలైన మజ్జిగ, పనిముట్లు ,అలాగే ప్రధమ చికిత్స కిట్టు అందచేయాలనివారు డిమాండ్ చేశారు. పనికి వేతనం ఒక రోజుకి 500 రూపాయలు చేయాలన్నారు . ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు గ్రామాల వారిగా జరిగే ఈ సదస్సులో అందరు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా సెక్రెటరీ ఇంతియాజ్ , ప్రాంతీయ కార్యదర్శి బ్యాళ్ల అంజి, సిఐటియు నాయకులు వెంకటేష్, సిపిఎం పార్టీ ఆఫీస్ కార్యదర్శి సిద్దు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!