ఎంత కష్టం.. ఎంత కష్టం
కూటి కోసం, కూలి కోసం
కాలె కడుపుతో నడుస్తున్నా
నెత్తిన సంచి, సంకన బిడ్డతో
బ్రతుకు బండిని లాగేందుకు
వలస బాటను పట్టినా….
కన్న వారికి దూరమైతి,
ఊర్లు దాటితి, ఏర్లు దాటితి
వలస కూలిగ మారిపోతి
తాగడానికి నీళ్ళు లేవు
తినడానికి తిండి లేదు
చేయడానికి పని లేదు
ప్రతిరాత్రి శివరాత్రై
కంటి మీద కునుకు లేదు
ఉన్న బోర్లు ఎండిపాయే
పంట లేమో పండకపాయే
లక్షలాది పెట్టుబడులు
మట్టిలోనే కలిసి పోయే
విధి లేక పాలుపోక
కరువు కోరల్లో చిక్కుకొని
గుడిసెలోనే కనుకు తీశా
ఉన్న పంటలు ఊడ్చుక పాయే
బ్రతుకు తెరువు లేకపాయే
వలసల సల సలతో
గ్రామాలు బోసి పాయే
చెంతనేమో చింతనాయే
అత్మాభిమానం సచ్చిపొయే
అప్పుల్లో కూరుకు పోయి
ఎడారి కష్టాలాయే
కన్నీటి వెతలతో
గుండె చెరువాయే పరిస్థితులతో
ఎన్నేళ్ళు బ్రతుకీడ్చిన
బ్రతుకు చిత్రం మారదాయే.
వీరా…! (దుంపాల వీరేష)
తెలుగు భాషోపాధ్యాయులు
యస్.యం.కె.వి ప్రభుత్వ ఉన్నత పాఠశాల
విద్యానగర్ గ్రామం,
మంత్రాలయం మండలం,
కర్నూలు జిల్లా
చరవాణి : 9110544030