
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మేము సహకరిస్తాం ..!
పొద్దుటూరు న్యూస్ వెలుగు : ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నివాసంలో పార్టీ కీలక నేతలు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం గోపవరం పంచయితీ ఉపసర్పంచ్ ఎన్నికల సందర్భంగా వైయస్ఆర్ సీపీకి చెందిన పలువురు నేతలపై జరిగిన దాడిని ఖండిస్తూ తమ సంఘీభావం తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. అందుకు కడప జిల్లా వైయస్ఆర్ సీపీ సహకరిస్తుందని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!