
ఎస్.ఎం భాషకు సన్మానం ఎంపీడీవో గా పదోన్నతి
తుగ్గలి (న్యూస్ వెలుగు) : జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కోసిగి మండలం ఎంపీడీవో గా పదోన్నతి పొందిన ఎస్.ఎం భాషకు పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. మంగళవారం మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక మండల ప్రజా పరిషత్ సర్వ సమావేశ భవనం నందు జరిగిన పదోన్నతి సన్మాన కార్యక్రమం తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు తుగ్గలి మండలంలో పరిపాలన అధికారిగా ఎస్.ఎం భాష చేసిన సేవలను వారు కొనియాడారు.విధినిర్వహణలో సమయపాలనను పాటిస్తూ అధికారుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించారని వారు తెలియజేశారు. ఆయనకు గల నైపుణ్యతతో మండలంలో గల వివిధ సమస్యలను పరిష్కరించి తోటి ఉద్యోగులకు ఎంతో అండగా నిలిచేవారని ఉద్యోగస్తులు తెలియజేశారు.ఆహార నియమ నిబంధనలను పాటిస్తూ,సమయం దొరికినప్పుడు పుస్తకాలను పటిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని వారు తెలియజేశారు.ఈ సందర్భంగా కోసిగి మండలానికి ఎంపీడీవో గా పదోన్నతి పై వెళ్తున్న ఎస్.ఎం భాషను ఉద్యోగులు శాలువాను కప్పి పూలమాలతో సత్కరించి బహుమతులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీత ఎస్.ఎం భాష మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదోన్నతులు సర్వసాధారణమని, ఎక్కడికి వెళ్లినా ప్రజలకు సేవలు అందించి వారి మన్ననలు పొందాలని ఆయన తోటి ఉద్యోగులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీహరి,జూనియర్ అసిస్టెంట్ రాంబ్రహ్మం,ఏపీవో హేమ సుందర్,ఈసీ రాజశేఖర్,పంచాయతీ కార్యదర్శులు గోపాల్,రాజు నాయక్, రామాంజనేయులు,రామకృష్ణ,శివ, మనోహర్,దేవేంద్ర,శరణ్,నాగేంద్ర నాయక్ తదితర పంచాయతీ కార్యదర్శులు,సచివాలయ ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది శేఖర్,బద్రి తదితరులు పాల్గొన్నారు.

