
ఎస్ టి యు నూతన కార్యవర్గం ఎన్నిక
ఎస్ టి యు నూతన కార్యవర్గం ఎన్నిక
తుగ్గలి ( న్యూస్ వెలుగు) : మండల కేంద్రమైన తుగ్గలిలో శనివారం రోజున ఎస్టియు మండల కార్యవర్గాన్ని ఉపాధ్యాయులు ఎన్నుకున్నారు.తుగ్గలి మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంలో భాగంగా ఎన్నికల పరిశీలకులు నాగేంద్రప్ప ఆధ్వర్యంలో తుగ్గలి మండల అద్యక్షులుగా సంజీవ, ప్రధాన కార్యదర్శిగా సూరన్న,ఆర్తిక కార్యదర్శిగా గోపాల్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం తుగ్గలి మండల అధ్యక్షుడుగా ఎన్నికైన సంజీవ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలపై ఎస్టియు రాజీలేని పోరాటం చేస్తుందని,ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి ఎస్టియు రాష్ట్ర కమిటీలు,జిల్లా కమిటీలు,మండల కమిటీలు ముందుండి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తుందని ఆయన అన్నారు.మండల ఎస్టియు కార్యవర్గంలో తమకు స్థాన కల్పించిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలంలోని ఎస్టియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

