
ఏడాదికి 50 వేల మందికి శిక్షణ: మంత్రి నారాలోకేష్
న్యూస్ వెలుగు అమరావతి: నైపుణ్య విభాగం అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించినట్లు ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ తెలిపారు. నైపుణ్యం పోర్టల్ ను దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించాను. సెప్టెంబర్ లో పోర్టల్ ప్రారంభానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం ఇంటర్నషిప్ స్కీమ్ తో నైపుణ్యం పోర్టల్ ను అనుసంధానించాలని సూచించాను. నైపుణ్యం పోర్టల్ డెమోను పరిశీలన అనంతరం మీడియా మాట్లాడారు. ఏడాదికి 50వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంటర్ విద్యకు సంబంధించిన అంశాలపైనా చర్చించడం జరిగిందన్నారు. దృష్టి లోపం గల విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు.
Was this helpful?
Thanks for your feedback!