
ఏపీ సాంకేతిక అభివృద్ధికి సహకరించండి: నారా లోకేష్
న్యూస్ వెలుగు న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో ఢిల్లీలో సమావేశం నిర్వహించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇటీవల ఏపీ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి ఆయనకు వివరించినట్లు వెల్లడించారు. ఏపీ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని, ఇందుకు కేంద్రం సహకారం ఎంతో అవసరం అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!