ఓటర్ల జాబితా తయారు చేయండి తహసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్
బండి ఆత్మకూరు న్యూస్ వెలుగు: నీటి సంఘాల ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని బండి ఆత్మకూరు తహసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్ అన్నారు.శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు గ్రామ సర్వేయర్ లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ నవంబర్ ఒకటవ తేదీ లోపు నీటి సంఘాల ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. టీజీపీ, కేసీకెనాల్, చెరువులు, ఆయకట్లలో సర్వే నెంబర్ల వారిగా రైతుల పేర్లు కులము వారిగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అన్నారు. 25 సెంట్లు కు పైబడి ఉన్న సాగు భూమితో పాటు పట్టదార పాసుబుక్ పుస్తకం ఉన్న వారికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ గురునాథం మండల సర్వేయర్ పర్వీన్ గ్రామ వీఆర్వోలు గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!