
ఓటు చోరీ ప్రజాస్వామ్య విరుద్ధం: క్రాంతి నాయుడు
కర్నూలు (న్యూస్ వెలుగు):ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన రాజకీయ ద్రోహాన్ని, ఓటు హక్కును అవమానపరిచిన చర్యలను వ్యతిరేకిస్తూ పత్తికొండ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన “ఓట్ చోర్ – గద్దె చోడ్” కార్యక్రమంలో భాగంగా 27,500 సంతకాలు సేకరించబడినాయని పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ తెలిపారు. ఈ సంతకాలను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ భాష సమక్షంలో అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ జిల్లా కార్యాలయానికి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ మాట్లాడుతూ ఈ ఉద్యమం ప్రజల ఆగ్రహానికి ప్రతిరూపమని, ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసిన నాయకులపై ఇది ప్రజాస్వామ్య సమాధానమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, అవినీతి మరియు రాజకీయ ద్రోహం పై నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు.
కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గ ప్రజలు, యువత మరియు పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ఇచ్చిన అద్భుతమైన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ కార్యదర్శి బి సుబ్రహ్మణ్యం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

