
కందుకూరు హత్య కేసు పై మంత్రులను అడిగి తెలుసుకున్న సీఎం
ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు): కందుకూరు హత్య కేసు బాధితులను పరామర్శించి వచ్చిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మునిసిపల్ వ్యవహారాల శాఖ పీ.నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో సచివాలయంలో సీఎం మంగళవారం సమావేశమయ్యారు. మృతుడు లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం, ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, కారు దాడిలో గాయపడ్డ పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని, భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని కూడా నిర్ణయించారు. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు పూర్తి చేయించాలని ఆదేశించారు.