కర్నూలుకు కాంగ్రెస్ కేంద్ర కమిటీ రాక ..!

కర్నూలుకు కాంగ్రెస్ కేంద్ర కమిటీ రాక ..!

కర్నూలు న్యూస్ వెలుగు : ప్రియతమ జాతీయ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ  మరియు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల రెడ్డి  ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జిల్లా మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియలో భాగంగా  కర్నూలు జిల్లాకు నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు  హెచ్ సి యోగేష్ జి , సాకే శంకర్ ,  సొంటి నాగరాజు , సూర్య నాయక్  24- 11- 2025 వ తేది సోమవారం కర్నూలు కు రానున్నట్లు పార్టీ కార్యలయం వెల్లడించింది . వారు జిల్లా కేంద్రంలో మరియు నియోజకవర్గాల కేంద్రాలలో కాంగ్రెస్ నాయకుల మరియు సీనియర్ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి ఆ నివేదికను అధిష్టానానికి సమర్పిస్తారని ,  సర్వే ద్వారా అర్హులైన వారిని అధిష్టానం ఎన్నుకోవడం జరుగుతుందన్నారు . కాబట్టి ఆసక్తి కలిగి పార్టీ పటిష్టత కోసం పని చేయాలనుకున్న వారు దరఖాస్తులను కేంద్ర కమిటీకి అందజేయవలన్నారు . జిల్లావ్యాప్తంగా ఈ కమిటీ ఈనెల 24వ తేదీ నుండి నియోజకవర్గాల వారిగా పర్యటిస్తుందని పార్టీ కార్యలయం వెల్లడించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!