కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

కర్నూలు ,న్యూస్ వెలుగు : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కర్నూలు జిల్లాలోకు ఎడతెరిపి లేకుండా వర్షం రుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు వర్షం ఆగకుండా కురవడంతో వాగులు, వంకలు నిండాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్త్తరు వర్షాలు పడితే.. కొన్ని మండలాల్లో భారీగా వానలు కురిశాయి. పత్తి, టమోటా, ఉల్లి వంటి ప్రధాన పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. హాలహర్వి మండలం మేడేహాల్‌ గ్రామంలో మిరప పంట, చిరుమాన్‌దొడ్డి గ్రామంలో టమోటా పంట నీట మునిగింది. గత సంవత్సరం వర్షాభావ పరిస్థితులు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఈసారి పంటలు చేతికి అందుతాయన్న ఆశతో అన్నదాతలు ఉన్నారు. అయితే పంటలు చేతికందే సమయంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పంటలన్నీ నీటి పాలై నష్టపోతామో అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. మరో నెల రోజుల్లో పంటలన్నీ చేతికి అందుతాయని, కనీసం ఇప్పటి నుంచైనా వర్షం సక్రమంగా కురిస్తే తాము లాభాలు చూస్తామని రైతులు ఆశిస్తున్నారు.

ఆశాజనకంగా వర్షపాతం

కర్నూలు రూరల్‌లో 42.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోసిగిలో 42, కర్నూలు అర్బన్‌లో 36.4, పెద్డకడుబూరులో 35.4, చిప్పగిరిలో 35.2, ఎమ్మిగనూరులో 34.8, మంత్రాలయంలో 34, దేవనకొండలో 27.6, కల్లూరులో 27.2, గోనెగండ్లలో 26.4, నందవరంలో 23.2, ఓర్వకల్లులో 20ఎం.ఎం., క్రిష్ణగిరిలో 15.6, వెల్దుర్తిలో 14.4, సి.బెళగల్‌లో 13.4, గూడూరులో 11.2, కోడుమూరులో 10.6, హోళగుందలో 10.4, హాలహర్విలో 9.8, మద్దికెరలో 9 ఎం.ఎం., వర్షపాతం నమోదైంది. జిల్లా అంతటా సగటున రెండు రోజులుగా 19.8 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వర్షం నమోదైంది. ఇప్పటిదాకా ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ నెలలో 77.7 వర్షం నమోదు కావాల్సి ఉండగా 140 ఎం.ఎం., నమోదైంది. జూలై నెలలో 90.7 వర్షం రావాల్సి ఉండగా.. 56.7 ఎం.ఎం., వర్షం నమోదైంది. ఆగస్టులో 116.2 ఎం.ఎం., వర్షం పడాల్సి ఉండగా.. 200.1 ఎం.ఎం., వర్షపాతం నమోదైంది. మరో నెల రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ముగిసిపోతుండటంతో ఇప్పటి నుంచి సక్రమంగా నిర్ణీత వ్యవధిలో కురిస్తే రైతులు సాగు చేసిన పంటలు సజావుగా వారి చేతికి అందే అవకాశం ఉంది.

 

Author

Was this helpful?

Thanks for your feedback!