
కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నిరసన
న్యూస్ వెలుగు కర్నూలు : కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ,దొంగ ఓట్లపై పోరాడుతున్న సందర్భంగా రాహుల్ గాంధీ కి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో జిలాని భాష పాల్గొని మాట్లాడుతూ దేశంలో దొంగ ఓట్ల దందా జరుగుతుందని ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేసిన బిజెపికి పడే విధంగా ఈవీఎంలను తయారు చేశారని దానికి ఈసీ సహకరించడం సిగ్గుచేటని ఒక చిన్న గదిలో 80 ఓట్లు ఉండటం ఒక వ్యక్తికి నాలుగు రాష్ట్రాలలో ఓట్లు ఉండటం ఎంత దురదృష్టకరమైన విషయమని దొంగ ఓట్ల ద్వారా అడ్డదారిలో అధికారం చేపట్టడం సిగ్గుచేటని వెంటనే కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ తన సుదీర్ఘ ప్రసంగంలో బిజెపి నాయకులు ఓట్లు ఎలా దొంగిలించారో స్పష్టంగా తెలియ జేశారని దేశ ప్రజలు బిజెపి చేస్తున్న మోసాన్ని గమనిస్తున్నారని త్వరలో కాంగ్రెస్ పార్టీని గెలిపించు కోనుటకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని జిలాని భాష అభిప్రాయ పడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మహారాష్ట్రలో 58 లక్షల ఓట్లు దొంగ ఓట్లు రాత్రికి రాత్రి చేర్పించి అధికారం చేపట్టారని బీహార్ లో ఇటీవల లక్ష అరవై మూడు వేల ఓట్లు తొలగించారని ఈసీ, మోడీ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎన్నికల నియమావళిని పరిహాసం చేస్తూ వారు మాత్రమే అధికారంలో ఉండాలని కుట్ర పన్నుతున్నారని నిజమైన ప్రజాస్వామ్యవాది యువ నాయకుడు రాహుల్ తన ఆపరేషన్ ద్వారా ఈసి, మోడీ చేస్తున్న దొంగ ఓట్లగుట్టును రట్టు చేశాడని కర్ణాటక రాష్ట్రంలో ఒక పార్లమెంటు నియోజకవర్గం లో ఒక లక్ష మూడువేల దొంగ ఓట్లు వేయించు కున్నారంటే ఇది ముమ్మాటికి మోడీ, ఈసీ కుట్రలో భాగమే అని వెంటనే రాష్ట్రపతి స్పందించి ఇటీవల జరిగిన ఎన్నికలను రద్దుచేసి ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ను తొలగించి సుప్రీంకోర్టు ద్వారా ఎన్నికైన ఎన్నికల కమిషనర్ ద్వారానే ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు జరపాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ వద్ద నిరసనలు చేశారు. గల మహాత్మా గాంధీ విగ్రహం ముందు బిజెపి, మోడీ, ఎన్నికల కమిషన్, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దొంగ ఓట్లను తొలగించి కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, ఐఎన్టియుసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి పాషా, కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర నాయుడు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎన్సి బజారన్న, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బి బతకన్న, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శులు రియాజుద్దీన్, సయ్యద్ నవీద్, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు పగిడాల అమన్, ఎస్సీ సెల్ మాజీ చైర్మన్ ఈ లాజరస్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు దివాకర్, డిసిసి మాజీ కార్యదర్శులు బి సుబ్రహ్మణ్యం, అబ్దుల్ హై, ఎస్సీ సెల్ మాజీ టౌన్ అధ్యక్షులు డబ్యు సత్యరాజు, ఐఎన్టియుసి సిటీ అధ్యక్షులు ఆర్ ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు ఏం సుంకన్న, ఆనందం బస్తిపాడు దస్తగిరి మొదలగువారు పాల్గొన్నారు.