కల్తీ మద్యం పై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది: ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి

కల్తీ మద్యం పై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది: ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి

పాణ్యం (న్యూస్ వెలుగు) : కల్తీ మద్యం పై వైసీపీ నాయకులు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. కర్నూలు లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యం తాగి వెల సంఖ్యలో మరణించారన్నారు. ప్రస్తుతం కల్తీ మద్యం చేస్తున్న వారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లే అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ మద్యం అరికట్టేందుకు సురక్ష యాప్ తీసుకుని వచ్చారన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం ఉన్నందున తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి మద్యం తాగేవారని ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి వైసీపీ నాయకులు మెడికల్ కళాశాలపై కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పీపీపీ విధానంపై అవగాహన లేని వైసీపీ నాయకులు మెడికల్ కళాశాల లపై మాట్లాడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని గౌరు చరితా రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి , విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ ఎస్ కె శ్రీనివాస రావు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి నియోజకవర్గ ముస్లిం మైనారిటి అధ్యక్షుడు ఎస్ ఫిరోజ్,తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజి గంగాధర్ గౌడ్ ,అర్బన్ యూనిట్ ఇంచార్జి జనార్ధన్ ఆచారి,శేఖరప్ప,సర్కార్,రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS