
కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు
కర్నూలు (న్యూస్ వెలుగు ): జిల్లా కేంద్రంలోని శ్రీ భీరప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 23వ కురువ కార్తిక వనభోజనం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హిందూపురం ఎంపీ పార్థసారథి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొని ఉసరి చెట్టు దగ్గర పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ పార్టీలకతీతంగా ఐక్యంగా ఉండి తమ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. రాజకీయాల్లో ముందు ఉండాలని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కులం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. కురువ కులస్థుల అందరూ ఐక్యమత్యంతో ఉంటే అన్ని సాధించుకుంటారని వారు తెలిపారు. కురువ కమ్యూనిటీ హాలుకు హిందూపురం ఎంపీ పార్థసారథి 25 లక్షలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి విద్యర్థి సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ అరుణ్ కుమార్, కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు గొర్రెల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు కల్లూరు సింగిల్ విండో చేర్మన్ శేఖర్. ఐఅర్ యస్ యాదగిరి డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున అరుణకుమారి కల్లూరు ఎంఅర్ఓ ఆంజనేయులు పాలసుంకన్న గడ్డం రామకృష్ణ కార్పొరేటర్ చిట్రా సత్యనారాయణమ్మ డాక్టర్ లక్ష్మీప్రసాద్ గౌరవ అధ్యక్షులు కిష్టన్న ప్రదానకార్యదర్శి ఎంకే రంగస్వామి ఉపాధ్యక్షులు కత్తి శంకర్ ఉరుకుందు దనుంజయ వెంకటేశ్వర్లు కె సి నాగన్న కొత్తపల్లి దేవేంద్ర బిఎన్ టాకీస్ వేంకటేష్ బూదూరు లక్ష్మన్న శివరాం తవుడు శ్రీనివాసులు తిరుపాల్ దివాకర్ ఎల్లయ్య పుల్లన్న రామకృష్ణ సిపిఎం వెంకటరాముడు మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ ప్రదానకార్యదర్శి అనిత నాగశేషులు ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు సర్పంచ్ లు ఎంపిటిసిలు జడ్పీటీసీ సభ్యులు ప్రజాప్రతినిధులు కులస్థులు భారి సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినట్లు సంఘం నిర్వాహకులు తెలిపారు.

ravi

