
కీలక సమావేశం నిర్వహించిన వైయస్ షర్మిల
న్యూస్ వెలుగు అమరావతి: APCC కార్యనిర్వాహక అధ్యక్షులు జేడీ శీలం, మస్తాన్ వలి గార్లతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యల మీద ఇరువురికి దిశా- నిర్దేశం చేయడం జరిగిందన్నారు. జేడీ శీలంకి ఉత్తర ఆంధ్రప్రదేశ్ రీజియన్ , మస్తాన్ వలి కి దక్షిణ ఆంధ్రప్రదేశ్ రీజియన్ పార్టీ బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ఈ సమీక్ష లో AICC సెక్రటరీ గణేష్ యాదవ్, APCC జనరల్ సెక్రటరీ మూసాని శ్రీనివాస్ రెడ్డి సైతం పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!